ఆ నగరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్?

61చూసినవారు
ఆ నగరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్?
విశాఖ నగరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అధికారం చేపట్టిన నెల రోజుల తర్వాత చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టారు. విశాఖ అభివృద్ధే అజెండాగా తన పర్యటనను కొనసాగించారు. తొలి పర్యటనలోనే భోగాపురం విమానాశ్రయ పనులను పర్యవేక్షించారు. అలాగే శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని సమీక్షించారు. విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా, ఫిన్‌టెక్ జోన్‌గా అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్