AP: ఈ నెల 18న గుంటూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సీఎం ప్రారంభించనున్నారు. 'వేస్టు టు ఎనర్జీ ప్లాంట్'ను కూడా ప్రారంభిస్తారు. అలాగే కడప జిల్లాలో జరగనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.