గుండెపోటుతో నటుడు సుదీప్ పాండే మృతి

79చూసినవారు
గుండెపోటుతో నటుడు సుదీప్ పాండే మృతి
భోజ్‌పురి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుదీప్ పాండే గుండెపోటుతో మరణించారు. సుదీప్ పాండే మరణవార్త భోజ్‌పురి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన జనవరి 15 (బుధవారం)న ముంబైలో కన్నుమూశారు.  సుదీప్ పాండే భోజ్‌పురి సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించాడు. అతను భోజ్‌పురిలో ఖూనీ దంగల్, భోజ్‌పురి భయ్యా, బహినియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్