ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ‘కాంటే వాలే బాబా’ ముళ్లపై పడుకుని భక్తులను ఆశ్చర్యపరిచారు. ఆయన అసలు పేరు రమేష్ కుమార్ మాంఝీ. గత 40-50 ఏళ్లుగా ఇలా ముళ్లపై పడుకుంటున్నట్లు తెలిపారు. ఇలా చేయడం వల్ల గాయాలు కావని ఆయన చెప్పారు. తనకు దేవుడే జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తున్నాడని, తనకు వచ్చే దక్షిణలో సగం దానం చేస్తానని తెలిపారు.