ఖరీదైన కారులో వచ్చి దొంగతనం

65చూసినవారు
దర్జాగా ఖరీదైన కారులో వచ్చి దొంగతనం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో సంచలన రేపుతోంది. పొన్నూరు పట్టణంలో ఓ ముఠా ఫార్చునర్ కారులో బంగారు ఆభరణాల షాప్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 38 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగతనం చేస్తున్న క్రమంలో స్థానికులు గమనించి దోపిడీకి పాల్పడిన ముఠాలోని ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితులది రాజస్థాన్‌గా పోలీసులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్