పొట్లకాయ లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి స్థానిక వాతావరణ పరిస్థితులు, భూసారం ఆధారంగా విత్తన రకాలను ఎంచుకోవాలి. దీని సాగుకు అధిక తేమ అవసరం. సాగు చేయాలనుకునే రైతులు జనవరి రెండో వారం వరకూ విత్తుకోవచ్చు. వరుసల మధ్య 1.5-2 మీటర్ల దూరం, మొక్కల మధ్య 90 సెం.మీ దూరంలో పందిరి విధానంలో సాగు చేయాలి. మల్చింగ్ విధానం వల్ల చీడ పీడలు, కలుపు నివారించవచ్చు.