శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులకు సరైన వైద్యం అందడం లేదని, మరణాలపై స్పష్టత లేదని బొత్స విమర్శించగా అచ్చెన్నాయుడు ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4వేల కోట్లతో పంచాయతీల బలోపేతానికి చర్యలు చేపట్టిందన్నారు. గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లూ బొత్సనే ప్రాతినిత్యం వహించిన విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు.