AP: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం’ అని సీఎం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.