గణేష్ మండపాల అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే మైక్ పర్మిషన్‌కు, విగ్రహం హైట్‌ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పారు. మైక్ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలని ఆమె తెలిపారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. దాంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.