క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన డ్వేన్ బ్రావో

55చూసినవారు
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన డ్వేన్ బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 40ఏళ్ల బ్రావో తన చివరి కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సీజన్ లో గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. '21 సంవత్సరాల ప్రొఫెషనల్ క్రికెటర్ గా నా ప్రయాణం ఎత్తుపల్లాల మధ్య సాగింది. నాకు అన్నీ అందించిన ఆటకు ఈరోజు నేను వీడ్కోలు పలుకుతున్నాను' అని బ్రావో రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్