తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య ట్వీట్‌ల పరంపర కొనసాగుతోంది. ఈ ట్వీట్‌లను ఉద్దేశించి పవన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ప్రకాశ్ రాజ్ అంటే నాకు ఇష్టం. నాకు మంచి మిత్రడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. ఆయనతో ఒక సినిమా కోసం వర్క్ చేస్తున్నా. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్షపడాలని నేను ట్వీట్ పెట్టినప్పుడు ఆయన ఆవిధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు.’ అని పవన్ అన్నారు.