అన‌కాప‌ల్లిలో దేవుడి ఊరేగింపులో అప‌శ్రుతి.. 13 మందికి గాయాలు

78చూసినవారు
దేవుడి ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. మంటలు అంటుకుని ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా అనకాపల్లిలోని గొల్లవీఢిలో దేవుని ప‌ల్లకీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో జ్వాలా తోరణం కిందపడటంతో 13 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని, వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్