ఆర్వో సీల్‌ లేని పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దు: ఈసీ

58చూసినవారు
ఆర్వో సీల్‌ లేని పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దు: ఈసీ
రిటర్నింగ్‌ అధికారి సీల్‌ లేని పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫామ్‌ 13ఏపై ఆర్వో సంతకంతో పాటు పూర్తి వివరాలు ఉంటే ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఆర్వో సంతకం సహా బ్యాలట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్‌ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలట్‌ సీరియల్‌ నంబర్‌ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అని ఈసీ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్