రావి నారాయణరెడ్డి 1908 జూన్ 4న నేటి యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామంలో వెంకట రామమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులకు జన్మించాడు. గోపాల్‌రెడ్డి వేల ఎకరాల భూమి గల పటేల్ పట్వారీ. పోలీసు శాఖలో ఉద్యోగం చేశాడు. రావి నారాయణరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బొల్లేపల్లిలో, కొంతకాలం భువనగిరి మిడిల్ స్కూల్లో, ఆ తర్వాత హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ హైస్కూల్లో చదివాడు. అటు పిమ్మట నిజాం కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించాడు. క్రీడల్లో కాలేజీ ఛాంపియన్‌గా నిలిచాడు.