పర్యావరణ హితం కోరుతూ వివిధ రకాలుగా గణనాథుడిని తయారు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కోడూరి పరశురామ్‌గౌడ్ దారంతో గణపయ్య రూపం మలిచాడు. ప్రతి ఏటా రంగులు, రసాయనాలు వాడకుండా దారం, కాగితాలను మాత్రమే ఉపయోగించి గణపతులను తయారు చేస్తుంటాడు. ఇందులో భాగంగా ఈ సారి 5.5 ఎత్తున్న ప్రతిమను తయారు చేశాడు.