ఏపీలోని టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తావు ఇవ్వకూడదని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని CBN హెచ్చరించారు. వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు అని చెబితే.. వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వద్దని ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు వివరించారు.