సుప్రీంకోర్టు తీర్పుపై మీడియా సమావేశం నిర్వహించిన జగన్ ధర్మారెడ్డి తనకు బంధువు కాదనట్లు మాట్లాడారు. టీడీపీ లేనిపోని అబద్ధాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీడీపీ కౌంటర్ ఇచ్చింది. నీకు ధర్మారెడ్డి ఎవరో తెలియదా ? కరుణాకర్ రెడ్డి నీ బంధువు కాదా? సుబ్బారెడ్డితో నీకు సంబంధం లేదా? ఇప్పటికే తల్లిని, చెల్లిని గెంటావ్.. రేపు వైఎస్ఆర్ ఎవరు? అతనితో నాకు సంబంధం ఏంటి అంటావా..? అని టీడీపీ ఓ ఫొటో విడుదల చేసింది.