చాగల్లు మండలం దారవరం గ్రామంలో అంబేద్కర్ వీధిలో కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న రోడ్డులో గత వైసీపి ప్రభుత్వ హయాంలో వేసిన నాణ్యత లేని రోడ్డు వేయటం వల్ల అది పాడైంది. అంతే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాన్ హోల్ పైన మూతలు వేయకుండా అలాగే వదిలేయటం వల్ల దుర్వాసన వస్తోంది. ఆ రోడ్డు ఎలక్షన్ కోడ్ లో అమలు లో ఉన్నప్పుడు హడావిడిగా క్రమ పద్ధతిలో వేయలేదు. నాయకులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.