అల్లవరం మండలం కొమరగిరిపట్నం పంచాయతీ పరిధిలో ఆదివారం పిచ్చి కుక్క పశువులపై దాడి చేసి గాయపరిచింది. గ్రామంలో వెంకన్నచెరువు గట్టు ప్రాంతంలో రైతుల పొలాల వద్ద కట్టి ఉన్న 5 గేదెలు, ఒక ఆవును పిచ్చికుక్క గాయపర్చినట్లు స్థానికులు తెలిపారు. వీటికి తక్షణం టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి నారాయణ తెలిపారు. కాగా, కుక్కల స్వైర విహారంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.