రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోందని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద 10వ తరగతి విద్యార్థుల 100% ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రణాళికను విద్యార్థులందరూ అనుసరించాలన్నారు.