రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదిక పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచే విధంగా అధికారుల తీరు ఉండాలని కలెక్టర్ మహేష్ సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీ నిశాంతితో కలిసి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో 218 మంది తమ సమస్యల పట్ల అర్జీలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.