అమలాపురంలో గుర్తుతెలియని ఆగంతకుడు బైక్ ను దర్జాగా ఎత్తుకెళ్లాడు. సోమవారం స్థానిక నల్ల వంతెన సమీపంలో ఓ షాపు వద్ద బండి యాజమాని లక్ష్మీ నరసింహారావు పార్క్ చేయగా గమనించిన అగంతకుడు బైక్ తో దర్జాగా ఉడాయించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అమలాపురం పట్టణ పోలీసులకు బండి యజమాని నరసింహారావు ఫిర్యాదు చేశారు.