ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను కోనసీమ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆయన బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 18 లోపు నామినేషన్లు ఇవ్వాలని సూచించారు.