రామచంద్రపురం మండలం ద్రాక్షారామం వెల్లలో పంట పొలాల మధ్య డంపింగ్ యార్డ్ పెట్టొద్దని గ్రామస్థులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. డంపింగ్ యార్డ్ వల్లలో ప్రజలకు, పంట పొలాలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు. తమకు ఉన్న పంట పొలాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ఆధారం లేకుండా చేయొద్దని కలెక్టర్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.