104 ఉద్యోగులు సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించాలని కోనసీమ 104 జిల్లా ఉద్యోగ సంఘం కార్యదర్శి త్రిమూర్తులు కోరారు. మంగళవారం అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. 104 సేవలను పీహెచ్సీల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తే ఖర్చు తక్కువ అవుతుందన్నారు. జీఓ నంబర్ 7ను అమలు చేసి యాజమాన్యం చెల్లించాల్సిన పిఎఫ్, ఈసీఐ, ఇంక్రిమెంట్లు చెల్లించాలని కోరారు.