ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి యధావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్ లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.