అమలాపురం పొట్టి శ్రీరాములు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దె బకాయిలు పేరుకుపోవడంతో రెవెన్యూ అధికారి భూపతి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆదివారం బకాయిలు వసూళ్లు చేశారు. ఒక్క రోజులోనే రూ. 4. 45 లక్షలు వసూలు చేశారు. అయిదు షాపులకు తాళాలు వేశారు. కొంతమంది బకాయిదారులు రెవెన్యూ అధికారులు దుకాణాల వద్దకు వెళ్లగానే బకాయి అద్దెలు చెల్లించారు. మరి కొంతమంది గడువు కోరారు.