నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులై నవ సమాజాన్ని నిర్మించాలని డీఈవో డాక్టర్ ఎస్కే సలీమ్ బాషా అన్నారు. అమలాపురం శ్రీవాగ్దేవి స్కూల్ లో శనివారం జరిగిన బాలల దినోత్సవ కార్య క్రమానికి డీఈవో బాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్కూలు డైరెక్టర్ పరసా భరత్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు జిల్లా ఉప విద్యా శాఖాధికారి గుబ్బల సూర్య ప్రకాశం, ప్రిన్సిపల్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు బహుమతులు అందించారు.