బిక్కవోలు మండలం కొమరిపాలెంలో టీడీపీ నాయకుడు ద్వారంపూడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం భారీ భోగి మంట ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేసి భోగి వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.