పి. గన్నవరంలోని ఏనుగుపల్లి ఏటిగట్టు సెంటర్ వద్ద ఉన్న మద్యం షాపును తొలగించాలని కోరుతూ ఆర్. ఏనుగుపల్లి, కే. ఏనుగుపల్లి గ్రామాల ప్రజలు పి. గన్నవరంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కె. వి. ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. మద్యం షాపు ఏర్పాటు వలన తమకు కలుగుతున్న ఇబ్బందులను ఆయా గ్రామాల సర్పంచులు దొమ్మేటి పార్వతి, తోలేటి బంగారు నాయుడు వివరించారు.