తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం చేయూత సేవా సంస్థ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై డి రామారావు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సత్యనారాయణ, చేయూత సేవా సంస్థ ఫౌండర్ చేయూత రవి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలో రెడ్ క్రాస్ సంస్థలో చేయూత సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకుని తలసేమియా చిన్నారులకు కోసం రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు.