కాకినాడ: మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టాలి

65చూసినవారు
కాకినాడ: మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలని, మహిళలు చిన్నారులపై అత్యాచారాలు అరికట్టాలని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె. సత్తిరాజు లు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుండి నిర్వహించిన ప్రజాపోరు క్యాంపెయిన్ ముగింపు సందర్భంగా శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్