కాకినాడ: నన్ను చంపేస్తారేమో.. కాపాడండి
కాకినాడ జిల్లా గండెపల్లి మండలం యల్లమిల్లికి చెందిన కుమారి అనే మహిళ జీవనోపాధి కోసం కువైట్ కి వెళ్ళింది. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన ఆమె అక్కడ చిత్రహింసల పాలవుతోంది. అక్కడ తను పడుతున్న చిత్రహింసలపై కుమారి రహస్యంగా వీడియో తీసి బంధువులకు పంపింది. తనకు సరిగా తిండి కూడా పెట్టడం లేదని, కొడుతూ హింసిస్తున్నారని.. నన్ను చంపేసేలా ఉన్నారని బాధిత మహిళ కుమారి కన్నిటీ పర్యంతమైంది.