విజ్ఞాన వికాసానికి గ్రంథాలయమే వేదిక అని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను భద్రపరిచే భాండాగారాలు కావని, అవి విజ్ఞాన వికాసానికి వేదికలని ఆయన అభివర్ణించారు. సెల్ఫోన్ వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.