
కాకినాడ.. 46 నకిలీ మద్యం బాటిళ్ళ స్వాధీనం
ఖాళీగా ఉన్న విదేశీ మద్యం సీసాలో స్థానిక మద్యాన్ని నింపుతూ విదేశీ మద్యం అంటూ విక్రయాలు చేస్తున్న ఇరువురుని అరెస్ట్ చేసి వారి నుండి 46 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందనిత్రీటౌన్ సీఐ కెవిఎస్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ కు సయ్యద్ సలీం భాషా , రామకృష్ణ లనుఅరెస్టు చేయడం జరిగిందన్నారు.