యూటీఎఫ్ 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం కాకినాడ పీఆర్ కాలేజీ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ సమావేశాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ. వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఐవీ రావు పాల్గొన్నారు. ఉపాధ్యాయ, విద్యా రంగం సమస్యలపై చర్చిస్తున్నారు.