Jan 10, 2025, 01:01 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ కు ఎంపికైన మురళీకృష్ణ
Jan 10, 2025, 01:01 IST
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించారు. ఉపాధ్యాయ విభాగంలో వనపర్తి జిల్లా యాపర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పి. మురళీకృష్ణ సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైనట్లు వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని తెలిపారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను డీఈఓ అబ్దుల్ ఘని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.