కొత్తపేట: మద్యం షాపు తొలగించాలంటూ మహిళలు ధర్నా

54చూసినవారు
కొత్తపేట: మద్యం షాపు తొలగించాలంటూ మహిళలు ధర్నా
కొత్తపేట మండలం అవిడి రేవు వద్ద ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివారం మహిళలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెయిన్ రోడ్డుపై బస్సు దిగి గ్రామంలోకి వెళ్లాలంటే మద్యం షాపు మీదుగా వెళ్లాల్సిందే దీంతో మహిళలు విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. అనంతరం వినతిపత్రాన్ని సమర్పించారు.

సంబంధిత పోస్ట్