అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

78చూసినవారు
కాట్రేనికోన మండలం కొత్తపాలెంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నామని ఎస్సై అవినాష్ తెలిపారు. అతని నుంచి రూ. 5, 900 విలువచేసే 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశామన్నారు. అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై అవినాష్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్