రాకపోకలకు అంతరాయం

2232చూసినవారు
కాట్రేనికోన గేటు సెంటరు పరిసరాల్లో ప్రధాన రహదారులపై ఆవుల సంచారంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కాట్రేనికోనలో కొన్ని నెలలుగా సుమారు 20కి పైనే అవులు, కొన్ని ఆబోతులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఎస్బీఐ కూడలి, వంతెన, హైస్కూల్ రోడ్డు, సుబ్రహ్మణ్యేశ్వర కూడలి తదితర చోట్ల రోడ్లపై సంచరిస్తూ అక్కడే పడుకుంటుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది వాటిని ఢీకొని పడిపోయి గాయపడిన ఘటనలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్