తాళ్లరేవు: 26న ఆందోళన జయప్రదం చేయాలి
కేంద్రం ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక, కర్షక, స్కీం వర్కర్ల సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళనను జయప్రదం చేయాలని ఆయా సంఘాల నేతలు కోరారు. శుక్రవారం తాళ్లరేవు మండలం తాళ్లరేవులో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. 26న జరిగే ఆందోళనలో పెద్ద ఎత్తున రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, స్కీం వర్కర్లందరూ పాల్గొనాలని నాయకులు కోరారు.