పుదుచ్చేరి స్వపరిపాలనశాఖ కార్యదర్శి పి. జవహర్ తో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా యానాం పురపాలక సంఘంలో ఒప్పంద పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న హెచ్ఎర్ సంస్థ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు విడుదల చేయాలని కోరారు. యానాం పాఠశాలల్లో పారా టీచర్ల నియామకానికి అనుమతులివ్వాలని కోరగా దీనిపై విద్యామంత్రి, సీఎస్ లతో సంప్రదించి త్వరలో చర్యలు తీసుకుంటానని జవహర్ తెలిపారు.