ముమ్మిడివరం శ్రీ కృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల, సర్ డాక్టర్ రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సంరక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై జ్వాలా సాగర్ మాట్లాడుతూ విద్యార్థినులు తల్లి తండ్రులను తప్ప ఎవరినీ నమ్మవద్దని సూచించారు. సోషల్ మీడియాను విజ్ఞానం కొరకు మాత్రమే వినియోగించాలన్నారు. అపరిచితులకు ఎటువంటి ఫోటోలు షేర్ చేయవద్దు అని కోరారు.