ఉండ్రాజవరం మండలం కె. సావరంలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్తో నాగేంద్ర అనే యువకుడు గురువారం రాత్రి మృతి చెందారు. తణుకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నా అతను ఇనుప నిచ్చెన తీసుకెళ్తుండగా కరెంట్ తీగలు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.