100 రోజుల పాలనపై మంత్రి ప్రచారం

51చూసినవారు
100 రోజుల పాలనపై మంత్రి ప్రచారం
నిడదవోలు మండలం డి. ముప్పవరం గ్రామంలో కూటమి ప్రభుత్వ పాలన 100రోజుల పూర్తయిన సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ, వారి నుంచి అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్