కార్తీక మాసం ద్వాదశి మహా పర్వదినాలు పురష్కరించుకుని సామర్లకోట లో స్వామివారి ఉత్సవమూర్తులను సూర్య వాహనంపై అలంకరించి పురవీధుల. మీదుగా శనివారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు చక్రవర్తులు నారాయణాచార్యులు ఆద్వర్యంలో నిర్వహించిన ఈ గ్రామోత్సవం నకు ముందుగా ఆలయం లో స్వామివారికి, మహాలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి గ్రామోత్సవం ముగిసిన అనంతరం ఆలయ గోదావరి పుష్కరిణి వద్ద ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం సాదరంగా నిర్వహించారు.