బలభద్రపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బలభద్రపురం గ్రామంలోని దేవి సెంటర్లో మోటార్ సైకిల్ పై వెళ్తున్న శ్రీనుని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు బలభద్రపురం గ్రామంలోని వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు.