సామర్లకోట కెనాల్ రోడ్ పెద్దపెద్ద గోతులతో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుండగా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కూటమి నాయకులతో కలిసి పూడ్చివేత పనులు ప్రారంభించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రోడ్లకు మరమ్మత్తులు జరగకపోవడంతోపాటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక రోడ్లు మరింత దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తుమ్మలబాబు తదితరులు పాల్గొన్నారు.