May 20, 2024, 14:05 IST/మక్తల్
మక్తల్
పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసుల దాడులు
May 20, 2024, 14:05 IST
మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామంలో సోమవారం పేకాట ఆడుతున్న ఇంటిపై దాడులు చేసినట్లు ఏఎస్సై మన్నన్ తెలిపారు. వెంకట్ రామ్ రెడ్డి ఇంట్లో డబ్బులు పెట్టి పందెం కాస్తూ పేకాట ఆడుతున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుండి రూ. 13, 100 నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.