గ్రామాలలో ఉన్న భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దేశించిన గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు. సామర్లకోట మండలం పవర పంచాయతీ వద్ద శుక్రవారం రెవెన్యూ ఆధ్వర్యంలో రీ సర్వే గ్రామ సభ జరిగింది.ఈ సందర్బంగా రైతుల నుంచి 20 అర్జీలు అందుకున్నారు. ఈసభలలో డీటీ వై. శ్రీనివాస్, సీతారామాచార్యులు,శృజనాదేవి, రాజమణి, మోషేరాజు, ఆర్.సత్యవేణిలు పాల్గొన్నారు.